Monday, 4 April 2016

Mahapadma Nanda(Nanda Rajavamsam History)


          మహపద్మ నంద చరిత్ర    
   భారతదేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తులు
   నంద రాజ వంశీయులు

మహపద్మ నంద ! భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి రాజు  అప్పటి దాక భారతదేశాంలో ఉన్న క్షత్రియ పాలన అంతటినీ దాదపుగ నాశనము చేసి నంద రాజ్యన్ని స్థాపించి భరతఖండాన్ని పరిపాలించీన మొట్టమొదటి వాడు. నందలు భారతదేశాన్ని 100 సంవత్సరములు పైగా పరిపాలించారు.
“జయంతనుజ బంద్యోపధ్యయ” రచించిన  “Class and Religion in Ancient India” గ్రంధములో నంద రాజులు భరతఖండముని 150 సంవత్సరములు పైగా పరిపాలించారు అని వ్రాసినారు.
రాజవంశీయుడు కాకుండానే రాజైన వాడు మహాపద్మనందుడు ! అతడోక సాధారణ పౌరుడు, మగధ రాజధాని పాటలీపుత్రలో మగధ రాజధాని పాటలీపుత్రలో ఒక వ్యక్తి "కాలశోకుడు" అనే రాజు దగ్గర ఆస్థాన క్షురకుడు(మంగలి) గా పని చేసేవాడు. కాలశోకుడు శిశునాగ వంశానికి చేందినవాడు అతనికి 10 మంది కుమారులు.కాలశోకుడు అతని కుమారులు క్షవరము చేసే సమయములో ఆ క్షురకుడిని ప్రతి రోజు అవమానించేవాల్లు.రోజులాగే ఆ రోజు కుడా ఆ క్షురకుడు క్షవరము చేయడానికి మగధ సామ్రాజ్యనికి వెళ్తాడు క్షవరము చేసే సమయములో ఆ క్షురకుడిని బాగ అవమానిస్తారు ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ క్షురకుడు క్షవరము చేసే కత్తితోనే కాలశోకుడిని అతని 10 మంది కుమారులని సంహరిస్తాడు.ఆ తరువత ఆ క్షురకుడు నేనే ఇంకనుండి మగధకు రాజుని అని ప్రకటిస్తాడు ఆయనే మహపద్మనందుడు. అక్కడ ఉన్న కోంతమంది సైన్యం తిరుగుబాటు చేస్తారు క్షురకుడువి నువ్వు రాజు ఎమిటి అని మహాపద్మనందుడు ఆ తిరుగుబాటును అణిచివేస్తాడు. విజయగర్వంతో మహపద్మ నందుడు భారతదేశాంలో ఉన్న క్షత్రియ రాజ్యలన్ని దాదపుగ నాశనము చేసి “నంద రాజ్యం” నీ స్థాపించాడు. మహపద్మ నందుడిని "మహపద్మ పతి, ఉగ్రసేనుడు, మహాక్షాతప్ర, మహక్షత్రాంతక " అని కుడా పిలిచేవారు. మహక్షత్రాంతక అనగ క్షత్రీయ రాజవంశీయుల మొత్తని సంహరించినవాడు అని అర్ధము.

అపర పరశురాముడిగా పేరు పోందిన మహపద్మనందుడు యుద్ధనికి వస్తున్నాడు అని తేలియగానే అనేక రాజ్యల వారు నందుడికి తమ రాజ్యముని అప్పగించి లోంగిపొయే వాల్లు ఇ విదముగా  భారతదేశాన్ని పరిపాలించి మొట్టమొదటి రాజుగా తన పరిపాలనని కోనసాగించాడు.

క్రీస్తునకు పూర్వం 5-4 శతాబ్ది నాటి నంద వంశ పాలనకు శ్రీకారం చుట్టిన మహాపద్మనందుడు ఆయన నిధిని భూగర్భంలో నిక్షిప్తం చేసినట్టు ప్రసిద్ధమైన కథ ప్రచారంలో ఉంది. మహాపద్మనందుడు వారసుడే మౌర్య చంద్రగుప్తుడు. లక్ష కోట్ల సువర్ణ ముద్రికలను సేకరించిన నందరాజు నిధిని గంగానది అడుగున నిక్షిప్తం చేశాడట! మహాపద్మము అనగా ఒక సంఖ్య దీని విలువ లక్ష కోట్లని బ్రౌన్ నిఘంటుకారుడు నిర్ణయించాడు! గంగానదికి ఆనకట్ట కట్టి నీటిని మళ్లించి ఇసుక తేలిన నదిలో తవ్వి లక్షకోట్ల తులాల బంగారాన్ని నందుడు పూడ్చి పెట్టించాడట! కోటి టన్నుల బంగారమన్న మాట ఇప్పటి లెక్కల్లో! తరువాత ఆయన నదిని మళ్లీ సువర్ణ నిధి నిక్షిప్త ప్రాంతం మీదకి మళ్లించాడట ఆ ఆనకట్టను తెంపి. చారిత్రక వాస్తవాన్ని కవిసమ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ తన చంద్రగుప్తుని స్వప్నంఅన్న చారిత్రక రచనలో పేర్కోన్నారు. మహా పద్మనందుడన్న పేరు క్రీస్తునకు పూర్వం నాటి చక్రవర్తికి అందుకనే వచ్చిందట !!    
క్రీ.పూ. 4 శతాబ్దంలో మహాపద్మనందుడు (2 పరుశురాముడిగా ప్రసిద్ధి) తెలంగాణ ప్రాంతాన్నికుడా మగధ రాజ్యంలో విలీనం చేశాడు. కరీంనగర్ రామడుగు వద్ద నందరాజుల కాలం నాటి విగ్రహమొకటి ఇటీవలే బయటపడిందట.

ఇది మౌర్యులకు పూర్వమే మహాపద్మనందుడు తెలంగాణా దాకా తన రాజ్యవిస్తరణ చేసాడన్న విషయం బలపడుతున్నది. అంతేకాదు మహపద్మనందుడు ఆంధ్రప్రదేశ్ లోని చాలప్రాంతాలని కుడా తమ మగధ రాజ్యములో విలినము చేసేడాని పురాణ రచేయితలు పేర్కోనారు.

పురాణాల ప్రకారము మాకన్న బలవంతులు లేరు అని విర్రవిగుతున్న క్షత్రీయులందరిని బ్రాహ్మణుడైన "పరశురాముడు" వధించాడు, ప్రాణబితితో పారిపోయిన మిగిలిన క్షత్రీయులని నాయిబ్రాహ్మణుడైన "మహపద్మనందుడు" వధించాడని పురాణరచేయితలు రచించిన చాల గ్రంధలలో పెర్కోన్నారు. అందుకే మహపద్మనందుడిని మరో పరశురాముడిగా అభివర్ణించేవాల్లు మహపద్మనందుడుఏకవిరాట్ బిరుదాంకితుడు.

మహపద్మ నంద కి తోమ్మిది మంది కుమారులు వారు సామ్రాట్ పంధుక నంద, సామ్రాట్ పంఘుపతి నంద, సామ్రాట్ భుతపలనంద, సామ్రాట్ రస్త్రపలన నంద, సామ్రాట్ గోవిష్ణక నంద, సామ్రాట్ దషసిధక నంద, సామ్రాట్ ఖైవర్త నంద, సామ్రాట్ మహేంద్ర నంద, సామ్రాట్ ధన నంద

వీరందరిని నవ నందులు అనేవారు అనగా (9 మంది నంద రాకుమారులు) అని అర్ధము, వీరంత ఒకోక్క ప్రాంతలలో రాజ్య పరిపాలన కోనసాగించేవాల్లు.  క్షత్రీయులకన్న మేన్నుగా నంద రాజ వంశీయులు రాజ్య పరిపాలన చేయగలము అని నిరూపించారు.  

మహపద్మనందుడు ఇల రాజ్యపరిపాలన చేస్తుంటాడు దక్షణాదికి చేందిన (ప్రస్తుతం మైసూరు) పాలిస్తున్న ఉత్తుంగ నరసింహుడు మహపద్మనంద గురించు తెలుసుకోని ఒక క్షురకుడు రాజ్యపాలన చేయుటయ అని మహపద్మనందుడిని ఎలగైన పదవిచితుడని చేయాలని ప్రణాళికలను సిద్ధము చేస్తుంటాడు
 మగధ పై దాడి చేసి తన రాజ్యంలో కలుపుకోవాలని పథకం వేస్తాడు మహపద్మనంతో నేరుగా తలపడే అంత దైర్యం నరసింహుడుకి లేదు ఎలగైన మహపద్మనందని వధించాలనుకుంటాడు. విషయము తేలుసుకున్న నందులకి రాజ గురువుగా ఉన్న తక్షశిల ఆచర్యుడైన చణకుడు (చాణిక్యుడి తండ్రి) ఎలాగైన నందుడుకి తేలియ చేయాలి అనుకుంటాడు, వాల్లకి రాబోతున్న ముప్పు గురించి హెచ్చరిస్తాడు. ఏం చెయ్యాలో నాకు తెలుసు నాకు నీతులు చెప్పడానికి వస్తావా? “ అని ఆగ్రహించిన మహపద్మనందుడు చణకుడుని చంపిస్తాడు.
తరువాత మహపద్మనందుడు ఆగమరచి ఉన్న సమయములో మహపద్మనందుడి పై దాడి చేసి నరసింహుడు మహపద్మనందుడు నీ వధిస్తాడు, నవనందులైన మహపద్మనందుడి తొమ్మిది మంది కుమారులను చెరసాలలో వేయిస్తాడు. మహపద్మనందుడు చనిపోయెనాటికి ఆయన వయసు 88సంవత్సరములు.
సరిగ్గా ఇక్కడే చాణక్యుడు రంగ ప్రవేశం చేస్తాడు నరసింహుడుని ఒప్పించి, నవనందులను విడిపించి, వారి కుటుంబాల క్షోభ తీరుస్తాడు, తిరిగి తక్షశిల వెళ్లిపోతాడు. తర్వాతి పరిస్థితులు త్వరత్వరగా మారిపోతాయి క్రోదముతో రగలిపోతున్న ధననందుడు తిరిగి తన రాజ్యముని ఎలాగయిన సాదించాలి అనుకుంటాడు కాని ధననందుడు నవ నందులలో ఆకరివాడు.
 క్షత్ర ధర్మం(రాజ నీతి) ప్రకారము మహపద్మనందుడి పెద్ద కుమారుడే మగధకు రాజు కావాలి ఇంకేవరు అవటానికి విలు లేదు. ఇప్పుడు ధననందుడు రాజు కావాలి అనే కాంక్షతో తన ఎనిమిది మంది సోదరులను చంపడానికి సిద్ధపడతాడు ధననందుడి దేబ్బకు వారి ఎనిమిది మంది సోదరులు ప్రాణ భయముతో పరుగులు పెడుతు ఉండగా ధననందుడు వారిని వెమ్మడించి వెమ్మడించి హతమరుస్తాడు తిరిగి మగధ సామ్రజ్యనికి రాజు అవుతాడు.
అప్పుడది అలెగ్జాండర్ జైత్రయాత్ర జరుపుతున్న సమయం లోకాలన్నీ జయించాక  చివరిగా అతడు భారతావనిని కూడా సమీపించే సూచనలు ఉన్నాయి దూకుడు మీద ఉన్నాడు అలెగ్జాండర్ అనేక దేశాలు ఆక్రమించుకుంటాడు బల్గేరియా, ఇజ్రాయిల్, ఈజిప్టు, లిబియా, ఇరాక్, ఇరాన్, ఆప్ఘనిస్థాన్, సోవియెట్ యూనియన్“. ఒకోక్కటి మోకాళ్లపై కుంగిన గుర్రాలవుతున్నాయి.
మిగిలింది భారతావని !
ప్రపంచాన్ని జయించడం అలెగ్జాండర్ టార్గెట్. హిందూఖుష్ పర్వతాలకు కాస్త అవతల ప్రపంచ భూభాగం అంతమౌతుందని అతడి గురువు అరిస్టాటిల్ చెప్పినట్లు గుర్తు. ఇప్పుడు అటువైపే వస్తున్నాడు అలెగ్జాండర్. హిందూఖష్ దగ్గర అప్పటికే నాలుగు నదుల్ని దాటింది అలెగ్జాండర్ సైన్యం. ఐదవ నది హైఫాసిన్ కూడా దాటితే మగధ, గాంధార రాజ్యాలు ! వాటిని కూడా జయిస్తే తనిక మేసిడోనియా చక్రవర్తి కాదు జగదేక గ్రీకు వీరుడు. నదిలోని నీళ్లను తలపై చల్లుకుని పులకరించిపోయాడు అలెగ్జాండర్. నదిని దాటి వస్తే మగధ !
దిగ్గున లేచి కూర్చున్నాడు చాణక్యుడు !
కలగన్నాడా? కాదు, అలెగ్జాండర్ కంటున్న కల నెరవేరబోతున్నదని గ్రహాలు చెబుతున్నట్లు గ్రహించాడు. భుజాల కిందికి దిగిన శిరోజాలను సాలోచనగా సవరించుకుని, జుట్టు ముడివేసుకోని పైకి లేచాడు చాణక్యుడు. తక్షశిల నుంచి తక్షణం మగధకు బయల్దేరాడు  అతడిప్పుడు మగధ చక్రవర్తి ధననందుడిని కలవాలి, అలెగ్జాండర్ ఎంతటి శక్తిమంతుడో వివరించాలి, మగధను రక్షించుకునే మార్గం చెప్పాలి. అసలు ధననందుడు నా మాట వింటాడా? విందులు, చిందులలో తేలిపోతున్న చక్రవర్తి. మేఘాలలోంచి కిందికి దిగుతాడా ? లేక పర్షియా చక్రవర్తి డేరియస్లా పరాజితుడై ప్రజల్ని, పడతుల్ని అలెగ్జాండర్కు వదిలి పారిపోతాడా ? రాజ ప్రస్థానము వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు చాణక్యుడు. తక్షశిల విశ్వవిద్యాలయ ఆచార్యుడతడు చరిత్ర తెలుసు, వర్తమానం తెలుసు, భవిష్యత్తూ తెలుస్తోంది. అలెగ్జాండర్మూకలు పర్షియా రాజధాని పెర్సిపొలిస్ను విజయగర్వంతో ఎలా తొక్కి నాశనం చేసిందీ అతడి బుద్ధి ఊహిస్తోంది. అంతటి దుర్గతి మగధకు గానీ, మరే భారత భూభాగానికి గానీ పట్టకూడదు. సభకు చేరుకున్నాడు చాణక్యుడునిండు సభలో కొలువై ఉన్నాడు ధననందుడు.
అందవికారుడికి ఇక్కడేమిటి పని అన్నట్లు సభ అతడిని నిలబెట్టి నిశ్శబ్దంగా చూస్తోంది చాణిక్యుడిని. చక్రవర్తికి రుచించని వార్తనూ వినేందుకు సభ సిద్ధంగా లేదు! చాణక్యుడు గొంతు సవరించుకున్నాడు. ‘‘దేవుడి దయ వల్ల మనమింకా మన రాజ్యంలోనే ఉన్నాము చక్రవర్తీ. సమయం మించిపోలేదు సరిహద్దులవైపు అలెగ్జాండర్ సైనిక బలగాలు కదులుతున్న సూచనలు గోచరిస్తున్నాయి. వారిని మనవైపు రానివ్వకుండా గాలివానలు ఆపుతున్నాయి. ఈలోపే మగధ, గాంధార రాజ్యాలు ఏకం కావాలి. లేదంటే మగధరాజ్యం మేసిడోనియా మహాసామ్రాజ్యపు తునకగా మిగిలిపోతుంది’’ అన్నాడు.
గర్జన, ఘీంకారం కలగలిపి అహంకరించాడు ధననందుడు ! సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది, సభలోని నిశ్శబ్దం బిక్కచచ్చింది. ‘‘ ఎవరక్కడ ! తీతువును తరిమికొట్టండి ’’ అన్నాడు, మళ్లీ ఒక్క క్షణంలో ఆగమన్నాడు.
‘‘
అతడి జుట్టు పట్టుకుని ఈడ్చుకువెళ్లండి. జుట్టు కిందే కదా మగధ సామ్రాజ్య భవిష్యత్తు ఉంది ! అలెగ్జాండరట, గాంధార దేశంతో సంధులు, సమాలోచనలట. జోస్యం వినేందుకు నేనీ పీఠం మీద కూర్చోలేదని ఆచార్యులవారికి అర్థమయ్యేలా దేహబుద్ధులను శుద్ధి చెయ్యండి ’’ అని ధననందుడు అజ్ఞాపించాడు.
మంత్రులు, పరరాజ్య ప్రతినిధులు, రాజ్యాధికారులు, రమణులు ఇందరున్న సభలో చాణక్యుడుకి అవమానం జరిగింది. అతడి ప్రజ్ఞకు ఘోర పరాభవం జరిగింది శరీరంతో పాటు మనసూ గాయపడింది. రక్తం ఓడింది. ఆగ్రహంతో, ఆవేదనతో, ప్రతీకారంతో బయటికి నడిచాడు, జుట్టు ముడి విప్పాడు  అవమాన భారముతో కుంగిపోయిన చాణక్యుడు ధననందుడితో శపథం చేస్తాడు.            
                             
ధననంద రాజ్యముని చూసుకోని నువ్వు విర్రవిగుతున్నావో నిన్ను నీ రాజ్యన్ని నామరూపాలు లేకుండా చేస్తాను అప్పటి వరకు నా జుట్టు ముడి వేయనని చాణక్యుడు శపథం చేసి వెల్లిపొతాడు. ధననందుడిని అడ్డుకోవడము అతి సులభము కాదు ఆపార పరాక్రమమైన బలశాలి ఆ తరువాతి కాలములో క్రీ.పూ.326 లో విశ్వవిజేతగా పేరుగాంచిన అలెగ్జండర్ నంద రాజు అయిన ధననందుడి పరాక్రమముని తేలుసుకోని భయపడి యుద్ధము చేయకుండానే వేనుతిరిగేడు అని పురాణా రచేయతలు పేర్కోన్నారు.
         నంద సైన్యం     : అశ్వకదళం 80,000

                                              : సైనిక ధళం 200,000

                                              : రధాలు 8,000

                                              : ఎనుగుల ధాళాలు 6,000
ధననందుడని ఎదుర్కోవాలి అంటే బలశాలి, మహవీరుడు కావాలి. ముడి వీడిన శిరోజాలు ప్రతీకార జ్వాలలై అనుక్షణం రగలి పోతునాడు చాణిక్యుడు. ఎదురవుతున్న ప్రతి యువకుడిలోనూ అతడు ధననందుడిని అంతము చేసే వాడిగానే చూస్తున్నాడు ! కానీ ఎవ్వరిలోనూ తనకు కావలసిన లక్షణాలు కనిపించడం లేదు. క్రమంలో చెట్లు, పుట్టలు, పల్లెలు, పట్నాలు గాలిస్తున్న చాణక్యుడికి లొఖాండీ అనే అటవీ ప్రాంతంలో (ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్లోని లక్నో)  ఒక వేసవి ఉదయం! బాల భానుడితోపాటు, ప్రచండ భానుడిలాంటి బాలుడు చాణక్యుడి కంట పడ్డాడు అతడే చంద్రగుప్తుడు. 
సమయంలో చంద్రగుప్తుడు క్రూరుడైన తన గురువును ఎదిరించి మాట్లాడుతూ ఉన్నాడు. తమరు చేస్తున్నది తప్పు గురువు గారు అని వాదిస్తున్నాడు విద్యాబోధన పేరుతో జరిగే దౌర్జన్యాన్ని సహించనని చెబుతున్నాడు. చదువులో మాత్రమే మీరు నా కన్నా అధికులు మనిషిగా నేను మీకన్నా అధికుడిని అని ధైర్యంగా అంటున్నాడు. చాణక్యుడికి ముచ్చటేసింది  నేరుగా బాలుడి తల్లి దగ్గరకు వెళ్లాడు ‘‘ నీ కుమారుడిని మగధకు చక్రవర్తిని చేస్తాను నాతో పంపించు ’’ అని అడిగాడు. అమె పేరు మురా దేవి మయూరాలను(నేమల్లు) కాసే కొండ ప్రాంత మహిళ. మురా అనుమతిపై చంద్రగుప్తుడిని తన వెంట తీసుకెళ్లి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు. అతడికి పదహారేళ్లు వచ్చేసరికి భయంకరమైన యోధుడు అవుతాడు చంద్రగుప్తుడి యుద్ధ నైపుణ్యముని చూసిన చాణక్యుడు ఒక సామన్యుడైన అడవి జాతికి చేందిన బాలుడుకు ఇంతటి యుద్ధ నైపుణ్యం ఎలా సాధ్యం! అని చంద్రగుప్తుడి తల్లి అయిన మురా దేవి వద్ధకు వెల్లి చంద్రగుప్తుని తండ్రి ఎవరు అని ప్రశ్నించగా నంద సోదరులలో ఒకరు ధననందుడి చేతిలో మరణించక ముందు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇటువైపు వచ్చి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెను వివాహమడేడాని వారికి పుట్టినవాడే చంద్రగుప్తుడని చాణిక్యుడికి చెబుతుంది మురా దేవి. విషయము తేలిసిన వెంటనే చాణక్యుడు కాసేపు ధిగ్బ్రాంతికి లోనవుతాడు, నేను నంద రాజ వంశాన్ని నాశానము చేస్తాను అని శపధం చేసానో అదే నంద వారసుడినా నేను చేరాతిసి విద్య నేర్పుతున్నది అని కాసేపు భాదపడ్డడు.
చాణిక్యునికి ఇంకోక పేరు కూడ ఉన్నది కౌటిల్యుడు అని అనగా కుటిలత్వం ఉన్నవాడు అని అర్ధము. వెనువేంటనే తేరుకోని తన కుటిల బుద్ధిని ప్రయొగించాడు, చంద్రగూప్త ప్రస్తుతము మగధ రాజ్యన్ని పరిపాలించుచున్నది మీ వంశీయులే నిజానికి స్థానము నీది. రాజు కావలనే కాంక్షతో ధననందుడు తన అన్నలైన మీ పిన తండ్రులని, మీ తండ్రి నీ వదించి తాను రాజు అయినాడు, అలాంటి క్రూరుడు రాజుగా పనికి రాడు అని అతడి పద్దెనిమిదవ యేట రాజ్యాధికార కాంక్ష రగిలిస్తాడు. అప్పటికి నంద వంశం మధ్య, దిగువ గంగానదీ పరివాహక ప్రాంతలలో విస్తరించి ఉంటుంది. చాణక్యుని వ్యూహం ప్రకారం చంద్రగుప్తుడు నంద వంశానికి వ్యతిరేకంగా ఉన్న భారతావనిలోని మిగతా రాజ్యాలను ఏకం చేసి దండయాత్ర చేస్తాడు. ధననందుడిని రాజ్యభ్రష్టుడిని చేసి తమ వారసుడైన చంద్రగూప్తుని చేతనే తన వంశీయులని వదింపచేస్తాడు చంద్రగూప్తుడి తల్లి పేరుతో సామ్రాజ్యాన్ని స్థాపించమని ఆదేసిస్తాడు చంద్రగుప్తుడి తల్లి పేరు ముర ఆమె పేరు మీదే మౌర్య సామ్రాజ్యాన్ని నిర్మించాడు. చంద్రగుప్తుణ్ణి రాజుగా చేసి నందుల మంత్రి రాక్షసుణ్ణే చంద్రగుప్తుడి మంత్రిగా చేస్తాడు చాణిక్యుడు. చాణక్యుడి కుటిలత్వంతో నంద రాజ్యము పేరుని మార్చి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. చంద్రగుప్తుడిని నందనవ్య అని కుడా అంటారు అనగా నంద వంశము యొక్క వారసుడు అని అర్ధము. తూర్పున బెంగాల్ అస్సాంల నుంచి పశ్చిమాన ఆఫ్గనిస్థాన్, బెలూచిస్తాన్ వరకు, ఉత్తరాన కాశ్మీర్, నేపాల్ నుంచి, దక్షిణాన దక్కను పీఠభూమి వరకూ మౌర్యులదే రాజ్యం ! చాణక్యుడు అనుకున్నట్లే నంద వారసుడి చేతనే వారి వంశాన్ని నాశనము చేయించి వారి నంద రాజ్యము పేరు మార్చి మౌర్య రాజ్యమునీ స్థాపింప చేస్తాడు, అప్పటికిగానీ చాణక్యుడు శాంతించడు !
మౌర్య సైన్యం   : అశ్వకదళం 30,000
                              : సైనిక ధళం 600,000                            
                              : ఎనుగుల ధాళాలు 9,000
చంద్రగుప్తుడు 42 యేట చనిపోతే తర్వాత ఆయన కుమారుడు బిందుసారుడు పరిపాలన కోనసాగిస్తాడు. బిందుసారుడు రెండవ మౌర్య చక్రవర్తి గ్రీకు వారు ఇతనిని అమిత్రోక్రేటిస్ లేదా అలిట్రోకేడిస్అని పిలిచే వారు. ఇది సంస్కృత అమిత్రఘాతని గ్రీకులో కి మార్చారు. అమిత్రఘాత అంటే శత్రువులను సంహరించేవాడు అని అర్థం.        బిందుసారుడి తర్వాత అతడి కుమారుడు అశోకుడు రాజ్యపరిపాలన కోనసాగించారు. మౌర్య సామ్రాజ్యమును పరిపాలించిన గొప్ప చక్రవర్తి అశోకుడు. అనేక సైనిక దండయాత్రల పర్యంతరము అశోకుడు పశ్చిమాన ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్, పర్షియా యొక్క పశ్చిమ ప్రాంతాల నుండి తూర్పున బెంగాల్ మరియు అస్సాంల వరకు, దక్షిణాన మైసూరు వరకు దాదాపు దక్షిణ ఆసియా మొత్తాన్ని పరిపాలించాడు. కళింగ యుద్ధం తరువాత శాంతి కారకుడై బౌద్ధ మతాన్ని అవలంబించడమే కాకుండా బౌద్ధ మత వ్యాప్తికి విశేష కృషి చేశాడు.
కళింగ యుద్ధం : మౌర్య చక్రవర్తి అయిన అశోకుని కళింగ యుద్ధం భారతదేశ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టము. కళింగ యుద్ధం అశోక చక్రవర్తి పాలనలోని 9 సంవత్సరం నుండి మొదలయ్యింది. అంటే సుమారు క్రీ.పూ. 265 లేదా 264 లో అన్నమాట. అశోకుని తండ్రి అయిన బిందుసారుడు అంతకుముందు కళింగను జయించడానికి ప్రయత్నించి విఫలుడయినాడు. బిందుసారుని అనంతరం అశోకుడు కళింగను తన సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఎంతో దారుణమైన యుద్ధం తరువాత మాత్రమే అశోకుడు సఫలుడయ్యాడు.

యావద్దేశం జయించాలి అనే అశోకుని సామ్రాజ్య కాంక్షకు తలవగ్గి దాసోహమనే సమయంలో స్వేచ్ఛ స్వతంత్ర అభిలాషతో ప్రాణాలొడ్డి ఎదిరించారు కళింగ ప్రజలు, కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు వధింపబడ్డారు. శోకమే ఎరుగని అశోకుడు ప్రాణ నష్టం చూసి శోకుడయ్యాడు. శాంతి కోసం బీజం వేశారు, ధర్మం కోసం మార్గం వేశారు. కళింగ యుద్దమే లేని నాడు అశోకుని శాంతి సందేశం లేదు,ధర్మ చక్రము లేదు. అందుకే కళింగ ప్రజలు తాము చనిపోయి అశోకునికి స్పూర్తి కలిగించిన శాంతి ప్రదాతలు. అయితే యుద్ధం అశోకుని జీవన సరళినే మార్చేసింది, యుద్ధ పరిణామాలని కనులారా చూసిన అశోకుని మనసు చలించి పోయింది. ఇక యుద్ధం చేయబోనని ప్రతినబూనాడు. కళింగ యుద్ధంలో లక్ష మంది పైగా కళింగ ప్రజలు, పది వేలకు పైగా ఆశోకుని సైనికులు వధింపబడ్డారు. యుద్ధ భూమిని ఆనుకుని ప్రవహించిన నదిలో నీరుకు బదులు రక్తం ప్రవాహమై పారిందని ప్రతీతి. తరువాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడచి ధర్మాన్ని, శాంతిని ప్రధాన పాలనా విధానాలుగా చేసుకున్నాడు.
అశోకుడు బౌద్ధ మతంలోకి చేరటం క్షున్నముగా పరిశీలిస్తే  గౌతమ బుద్ధుడి మొదటి శిశ్యుడు, బౌద్ధులందరికి మొదటి నాయకత్వం వహించిన వాడు ఆచార్య ఊపాలిక్షురక(మంగలి) కులానికి చేందినవాడే ఈ కారణము చేతనే అశోకుడు బౌద్ధమతంలోకి వెల్లుటకు ఆశాక్తి చుపినాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లే వారనే చరిత్ర చెపుతోంది. అశోకుడు దాదాపు నలభై సంవత్సరాలు పరిపాలించినట్లుగా అంచనా వేస్తున్నారు. అశోకుడు మరణించిన తరువాత మౌర్య వంశం సుమారు యాభై సంవత్సరాల వరకు అలాగే ఉంది. అశోకుడికి చాలా మంది భార్యాపిల్లలు ఉండేవారు అయితే వారి సంఖ్య పేర్లు మొదలగునవి కాలగర్భంలో కలిసిపోయాయి. మహీంద్రడు, సంఘమిత్ర అనే కవలలు ఆయన నాలుగవ భార్యయైన దేవికి ఉజ్జయినీ నగరంలో జన్మించారు. వీరిని బౌద్ధమత వ్యాప్తికై అశోకుడే ప్రపంచ దేశాటనకు పంపించి వేశాడు. వీరు శ్రీలంక కు వెళ్ళి అక్కడి రాజును, రాణిని మరియు ప్రజలను బౌద్ధమతంలోకి మార్చారు. కాబట్టి వీరు ఖచ్చితంగా అశోకుడు తర్వాత రాజ్యపాలన చేపట్టి ఉండకపోవచ్చు.
 --- క్షురక కులములో పుట్టిన చంద్ర వంశీయులు నంద రాజవంశీయులు ---
సామ్రాట్ మహాపద్మ నంద - నంద రాజ్యం స్థాపకుడు (క్రీ.పూ.424)
సామ్రాట్ పంధుక నంద
సామ్రాట్ పంఘుపతి నంద
సామ్రాట్ భుతపలనంద
సామ్రాట్ రస్త్రపలన నంద
సామ్రాట్ గోవిష్ణక నంద
సామ్రాట్ దషసిధక నంద
సామ్రాట్ ఖైవర్త నంద
సామ్రాట్ మహేంద్ర నంద
సామ్రాట్ ధన నంద – (క్రీ.పూ.321)(నవనంద రాజులలో ఆకరివాడు)
సామ్రాట్ చంద్రగుప్త మౌర్యుడు – (క్రీ.పూ. 322–298)
సామ్రాట్ బిందుసారుడు - (క్రీ.పూ. 298 – 273 BC).
సామ్రాట్ అశోకుడు - (క్రీ.పూ.273 – 232 BC).
దశరథుడు -(క్రీ.పూ. 232 – 224 BC).
సంప్రాతి -(క్రీ.పూ. 224 – 215 BC).
శాలిసూక -(క్రీ.పూ. 215 – 202 BC).
దేవవర్మన్ -(క్రీ.పూ. 202 – 195 BC).
శతధన్వాన్ -(క్రీ.పూ. 195 – 187 BC)
బృహద్రథుడు -(క్రీ.పూ. 187 – 184 BC)
-------------------------------------
* బిజ్జల || - కర్ణటకా ని పరిపాలించిన రాజు
* రాజ సింగం - తమిళనాడుని పాలించిన రాజు                
------------------------------------------------------------------                                            
గమనిక : మహపద్మనంద చరిత్ర 'విశాకదత్తుడు రచించిన క్రీస్తూ పూర్వము 4 శతాబ్ధానికి చేందిన "ముద్రరాక్షస" గ్రంధము' లోనిది .
చంద్రగుప్తుడు నంద వారసుడు అని అనేక గ్రంధాలలో రాసినారు " విశ్వనాధ సత్యనారయణ రచించి (నందో రాజా భవిష్యతి, చంద్రగుప్తుని స్వప్నము), డి.డి.కోశాంబి (భారతదేశ చరిత్ర), విష్ణు పురాణము, క్రీ.పూ.4వ శతాబ్దం విశాకదత్తుడు రచించిన ముద్రరాక్షస గ్రంధాలలో చంద్రగుప్తుడు నంద రాజు కి అయన భార్య "ముర దేవి"కి పుట్టిన కుమారుడు అని రాసినారు. దినికి సంభందించిన ఆధార గ్రంధాలు నా వెబ్ సైట్ వైద్యనాయీబ్రాహ్మిణుల (http://vaidyanayeebrahmin.hpage.co.in/)” లో పెట్టినాను.